తెలంగాణాలో ఆసక్తికర రాజకీయాలు మొదలవుతున్న నేపథ్యంలో అన్ని పార్టీ లు తమ బలం చూపించుకోవడానికి ప్రజల్లోకి దూసుకుపోతున్నాయి.. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నిక విషయంలో ఆ ప్రాంతంలో ప్రజలను మెప్పించడానికి అన్ని పార్టీ లు తమ తమ అస్త్రాలను సిద్ధం చేసుకోగా వాటికంటే ముందు గ్రేటర్ ఎన్నికలు జరుగుతాయి అని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ లో అందరు నాయకులూ తమ ప్రత్యర్థి పార్టీ పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు..