ఏ రాష్ట్రంలో అయినా అధికార, ప్రతిపక్ష పార్టీ లు ఒకరినొకరు విమర్శించుకోవడం సహజమే.. అయితే అది రాష్ట్రంలో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఢిల్లీ లో అసలే రాష్ట్రాలపై చులకన చూపు చూసే కేంద్ర ప్రభుత్వంలో ఇరు పార్టీ లు ఒకరిని ఒకరు విమర్శించుకోవడం ఎలా ఉంటుందంటే మన సంసారాన్ని నడిరోడ్డున వేసుకున్నట్లే ఉంటుంది.. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ లో ని అధికార, ప్రతిపక్షాల పరిస్థితి ఇలానే తయారైంది.. రెండు పార్టీలు రాష్ట్రంలోనే కాకుండా, జాతీయ స్థాయిలో ఒకరిపై ఒకరిని విమర్శించుకుంటూ పలుచన అవుతున్నాయి.