ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం దుబ్బాక లో ఉప ఎన్నిక నవంబర్ 3న పోలింగ్ జరగనుంది.. అదే నెల 10న ఫలితాలు విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తుంది. దేశ వ్యాప్తంగా 56 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు అందులో దుబ్బాక ఒకటి అన్నట్లు తెలుస్తుంది. నామినేషన్ల దాఖలకు ప్రారంభం తేదీ అక్టోబర్ 9 కాగా.. చివరి తేదీ అక్టోబర్ 16 గా నిర్ణయించారు. ఉపసంహరణకు అక్టోబర్ 19 వరకు గడువు ఇచ్చింది. దీంతో అన్ని పార్టీ లు దుబ్బాక లో గెలవడానికి రంగాలు సిద్ధం చేసుకుంటాయి. మరి ప్రజలు ఎ పార్టీ కి కిరీటం కట్టబెడతారో చూడాలి..