అధికారంలోకి వచ్చి రెండేళ్ళు కావస్తుండగా పార్టీ లోకి టీడీపీ నుంచి చేరికలు ఎక్కువైపోతున్నాయి అని తెలుస్తుంది.. ప్రస్తుతం బిసి పాట పాడుతున్న చంద్రబాబునాయుడుకు మరికొంతమంది బిసి నాయకులు త్వరలో ఝలక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ , రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి వంటి నేతలు టీడీపీ ని వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. అందుకు కారణం చంద్రబాబు ఇటీవలే 25 మంది పార్లమెంట్ ఇన్ ఛార్జ్ లను నియమించడమే అంటున్నారు.. తమకు కావాల్సిన వ్యక్తులను నియమించకపోవడం వల్లే వీరు ఈ నిర్ణయం తీసుకున్నారట..