2014లో తెరపైకి వచ్చిన ఓ హామీ రైతులను నట్టేట ముంచింది. అప్పుల కుప్పలోకి నెట్టేసింది.బాకీలు తీరుస్తూ అప్పులు తీర్చుకుంటున్న రైతులుచంద్రబాబు మాట నమ్మి రుణాలు చెల్లించడం ఆపేశారు. రైతు రుణ మాఫీ పథకం ఆంధ్రప్రదేశ్ లోని అన్నదాతలను కోలుకోలేని దెబ్బ తీసింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం లో ఉన్నప్పుడు రైతుకు రూ. 1.50 లక్షల వరకు రుణ మాఫీ చేస్తామని ప్రకటించింది. నాటి లెక్కల ప్రకారం 33 లక్షల మందికి రూ. 24 వేల కోట్లు రుణ మాఫీ చేయాల్సి ఉంది..