కళావెంకట్రావు ఈ పదవిలో కొనసాగుతుండగా అకస్మాత్తుగా ఆ స్థానంలో అచ్చెన్నాయుడు ని నిల్చో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.. అయితే కనీసం ఒక్క మాట అయిన అడగకముందే చంద్రబాబు ఇలా చేయడం కళా ని తీవ్ర అవమానానికి గురి చేసిందట.. దాంతో చంద్రబాబు సన్నిహితులతో అయన తన బాధను వెళ్లబుచ్చుతున్నారట.. “నేనేమన్నా పదవి ఇవ్వమని బతిమాలానా? అయినా.. అన్నీ నా కనుసన్నల్లోనే జరుగుతున్నాయా ? నామాటను పట్టించుకున్న వారేరీ ? ఇన్నింటిని కూడా తట్టుకుని నేను కాబట్టి కొనసాగాను. అయినా.. ఇప్పుడు నన్ను తొలగించాల్సిన అవసరం లేదు. అదే జరిగితే.. నా దారి నేను చూసుకుంటా!“ వారితో ఇన్ డైరెక్ట్ గా పార్టీ నుంచి వెళ్ళిపోతా అనే మెసేజ్ లు ఇస్తున్నారట..