ఇటీవలే అయన జగన్ ను టార్గెట్ చేస్తున్నట్లు ఓ సందర్భంలో మాట్లాడారు.. “వ్యవసాయ విద్యుత్ విషయంలో జగన్ నాలుగు వేల కోట్లకు ఆశపడ్డారని, అందుకే కేంద్రం చెప్పినట్టు ఆడుతున్నారని, ఇది రైతులకు ఉరివేయడమే“ అని హరీష్రావు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏపీలోనే కాదు తెలంగాణ లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.. అయితే ఇప్పటికే ఈ అంశంపై ఏపీలోని ప్రజలు, ప్రతిపక్షాలు జగన్ పై కొంత వత్తిడి తెచ్చే విధంగా ముందుకు పోతున్నారు.. ఇలాంటి సమయంలో తమకు జరిగిన నష్టాన్ని చూసుకోకుండా ఇలా జగన్ ను టార్గెట్ చేయడం ఏం బాలేదన్నది ఎపి వాదన..