తెలంగాణ లో టిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయ పార్టీ ను తాము డిసైడ్ చేస్తామని అంటున్నారు.. ఇప్పటికే హైదరాబాద్లో ఎన్నికల వాతావరణం ప్రారంభమయింది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణ ప్రారంభించడంతో.. తెలంగాణ ఎస్ఈసీ కూడా జిహెచ్ఎంసి ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టింది. రాజకీయ పార్టీలు కూడా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. గ్రేటర్ ఎన్నికల బాధ్యత తీసుకున్న కేటీఆర్ నవంబర్ రెండో వారం తర్వాత ఎప్పుడైనా ఎన్నికలుండొచ్చని, సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో 99 సీట్లు సాధించి తొలి సారిగా బల్దియా పీఠం పై గులాబీ జెండా ఎగరేశారు. ఈ సారి పక్కా సెంచరీ కొడతామని చెబుతోంది.