పార్టీ ఓడిపోతే పార్టీ పట్ల ప్రజలకు ఉన్న వ్యతిరేకత ఎక్కువయి అది వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని హరీష్ రావు భావిస్తున్నారట అందుకే ఇక్కడ ఎలాగైనా గెలిచి తీరాలని కేసీఆర్ కఠినమైన ఆర్డర్స్ పాస్ చేశారట. దుబ్బాక ఎమ్మెల్యే మరణం వల్ల ఈ ఎన్నిక వస్తుంది కాబట్టి సింపతీ ఓట్లు ఎలాగూ ఎటు పోవు, ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అన్ని చోట్లా విజయం సాధించింది. అన్ని శుభ పరిణామాలే ఉన్నా హరీష్ రావు ప్రజలను భయపెట్టే విధంగా రాజకీయాలు చేస్తున్నారు..టీఆర్ఎస్ కాకుండా వేరే వాళ్లకి ఓటేస్తే.. కరెంట్ కనెక్షన్లకు మీటర్లు వస్తాయని హరీష్ రావు భయపెడుతున్నారు. అయితే ఈజీ గా గెలిచేదాన్ని హరీష్ ఎందుకు కాంప్లికేట్ చేసుకుంటున్నారు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు..