పార్టీ ఓటమి పాలైన తర్వాత చంద్రబాబు చాలాకాలం వరకు అండర్ గ్రౌండ్ లో ఉన్నారని చెప్పాలి.. ఎందుకంటే గత రెండేళ్లుగా ఎప్పుడు కూడా అయన పార్టీ ని చక్కదిద్దుపెట్టుకోవాలనే ఆకాంక్ష ఎక్కడా కనిపించలేదు.. అమరావతి పోరాటం, జగన్ ని విమర్శించడమే ఆయనకు సరిపోయాయి..కనీ ఎక్కడ కూడా దిశా తప్పిన పార్టీ ని గాడిలో పెట్టుకోవాలని ఎక్కడా అనుకోలేదు. అలాంటిది ఇటీవలే పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ చార్జ్ లను నియమించి పార్టీ ని బాగుచేయడానికి మొదటి ప్రయత్నం అయితే ఇప్పుడు మొదలు పెట్టారు.. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజక వర్గాలకు గానూ ఇన్ చార్జ్ లను నియమించి సంచలనం రేకెత్తించారు..