ఎన్టీఆర్ ఇటీవలే ఓ సేవా కార్యక్రమాన్ని స్థాపించడానికి రెడీ అయినట్లు గా టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వరంగల్, హైదరాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నంలో స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి ఆయన బ్లడ్ బ్యాంక్ స్థాపించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. దీనికి సంభందించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అయన భార్య లక్ష్మి ప్రణతితో కూడా ఇప్పటికే చర్చించారని లక్ష్మీప్రణతి ఈ బాధ్యతలను చేసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.