టీటీడీ లో ప్రక్షాళన మొదలుపెట్టారని ఇటీవలే టీటీడీ లో జరిగిన మార్పును చూస్తే అర్థమవుతుంది. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ని బదిలీ చేశారు. ఆయనకు ఏపీ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి హోదాలో అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న జవహార్ రెడ్డికి త్వరలోనే టీటీడీ ఈవో పదవి కట్టబెట్టే అవకాశం కనిపిస్తోంది.టీటీడీలో ఉత్తరాది కి చెందిన ఐఏఎస్ అధికారి స్థానంలో రాష్ట్రానికి చెందిన వారిని నియమించడం ద్వారా యాత్రికులకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నారు.