ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తన సత్తా చాటేందుకు ముందుకు వస్తున్నారు.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీని విజయం దిశగా నడిపేందుకు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నుంచి ఒక్క రాజాసింగ్ మాత్రమే గెలిచారు. రాష్ఠ్రంలోనూ, నగరంలోనూ ఆ పార్టీకి ఎమ్మెల్యేలు లేకపోవడం లోటుగా కన్పిస్తుంది. ఎంపీలు మాత్రం నలుగున్నారు. నగరానికి చెందిన ఎంపీ కిషన్ రెడ్డి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇక నగరంలో ఎమ్మెల్యేలు లేని లోటును భర్తీ చేసుకునేందుకు బండి సంజయ్ కొత్త వ్యూహాన్ని రచించారు. ఆయనే పవన్ కళ్యాణ్..