రాజధాని విషయంలో బీజేపీ స్టాండు వేరేగా ఉంది. పవన్ స్టాండ్ వేరేగా ఉంది. పవన్ కళ్యాణ్ అమరావతి కి సపోర్ట్ చేస్తుంటే బీజేపీ మాత్రం ఏది రాజధాని అయినా పర్వాలేదన్నట్లు వ్యవహరిస్తోంది. అయినా కూడా ఇప్పటి వరకు ఇరు పార్టీల నాయకులు కలిసే ఉన్నారు. రాజధాని విషయంలో నిర్ణయం రాష్ట్రానిదేనని చెబుతున్న బీజేపీ.. ఒక రాజధాని కావాలా ? మూడు రాజధానులు ఉండాలా ? అనే విషయంలోనూ మౌనం పాటిస్తోంది. దీనిపై బీజేపీ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అయితే, ఇప్పుడు ఈ పార్టీ మిత్రపక్షంగా ఉన్న జనసేన మాత్రం అమరావతికే జైకొట్టింది.