జగన్ ని ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు వేసిన ప్లాన్ ఏంటి అంటే మరి రాష్ట్రంలో ఎలాగూ ఆయనకు అధికారం పోయింది. ఇక్కడ ఆయన మాట వినే అధికారి ఎవరూ లేరు.  పక్కరాష్ట్రం తెలంగాణలోనూ ఆయన కుక్కిన పేనల్లే ఉంటున్నారు. మరి ఎవరు చంద్రబాబుకు ఇప్పుడు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు? అంటే.. తమ్ముళ్ల వేళ్లన్నీ.. ఇప్పుడు ఢిల్లీ వైపు చూపిస్తున్నాయి. నిజమే.. తాను అధికారంలో ఉన్న సమయంలో చాలా మందికి చంద్రబాబు మేళ్లు చేశారు. ఈ మేళ్లు వల్ల లబ్ధిపొందిన వారిలో ఇప్పుడు కేంద్రంలో కీలక పదవుల్లో ఉన్న వారితో పాటు ఉన్న న్యాయ వ్యవస్థలో ఉన్నవారు కూడా ఉన్నారని తమ్ముళ్లు అనుకుంటున్నారు.