హరీష్ రావు కి టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ అనే పేరుంది.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా పార్టీ కి ఇబ్బంది వస్తే తీర్చే ఒకే ఒక్క నాయకుడు హరీష్ రావు.. ఈ విషయాన్నీ కేసీఆర్, కేటీఆర్ లు సైతం ఒప్పుకుంటారు. అందుకే ఎక్కడ ఇబ్బంది ఏర్పడినా తమ కంటే ముందు హరీష్ రావు ని ప్రవేశ పెట్టి తమకు అడ్డు లేకుండా చేసుకుంటారు.. అయితే తమకు ఎంతో అచ్చోచ్చిన హరీష్ రావు ను దుబ్బాక విషయంలో ఫుల్ వాడేసుకుంటున్నారు కేసీఆర్.. స్థానిక ఎమ్మెల్యే హఠాత్మరణంతో దుబ్బాక లో ఉప ఎన్నిక అనివార్యమైంది.