విద్యావంతుల్లో తెలంగాణ సర్కార్ పై కొంత వ్యతిరేక త ఉందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రజల్లోకి ఈ ప్రచారం వెళ్తే వచ్చే ఎన్నికల నాటికి ఇబ్బంది గా మారుతుందని తెలిసి కేసీఆర్ స్వయంగా దిగారని తెలుస్తుంది. గిత్యాల నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయిన జీవన్ రెడ్డి…. ఆ తర్వాత గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీగా గెలిచారు. భారీ మెజార్టీ వచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థికి పెద్దగా మద్దతు దక్కలేదు. గతంలోనూ హైదరాబాద్ – రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానానికి జరిగిన గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలోనూ టీఆర్ఎస్ ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ వచ్చి పార్టీ ని చక్కదిద్దాలని ప్రయత్నం చేస్తున్నారు.