ఎన్నికల్లో ఓడిపోయినప్పటినుంచి చాలా ప్రాంతాల్లో టీడీపీ జెండా ఎగరవేసే నాథుడే కరువైపోయాడని అనొచ్చు. కరోనా రావడంతో పార్టీ అధినేత ఇంటికే పరిమితమైపోయారు.. అయన కొడుకు సంగతి సరే సరి.. ఇద్దరు ఇంట్లో ఏం చేస్తున్నారో తెలీదు కానీ పార్టీ ను అయితే మాత్రం గంగలో కలిపేశారు.. ఎంతో కొంత పార్టీ కి కొంత పట్టు ఉన్న ప్రాంతాలను కూడా గాలికి వదిలేసి భవిష్యత్ అనేది లేకుండా చేసుకుంటున్నారు.. అయితే ఎక్కడ ఓడామో అక్కడే గెలిచి మళ్లీ జెండా పాతాలన్న లక్ష్యం రాజకీయ నేతలకు ఉండాలి. అలాంటిది టీడీపీ నేతల్లో ఎవరికీ లేదు.. ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా టీడీపీ నేతలకు ఈ విషయంలో అస్సలు పట్టింపు లేదు.. కానీ శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వ్యవహారం మాత్రం అందరికంటే కొంత తేడాగా ఉంది.