వైసీపీ లోకి వెళ్ళే వారిని ఆపడానికి అయన తనదైన స్టైల్ లో ఓ పథకం రచించారని తెలుస్తుంది.. బాబు చివరి అస్త్రంగా జమిలీ ఎన్నికల ను పార్టీ నేతలపై సంధించబోతున్నారు.. త్వరలోనే జమిలి ఎన్నికలు వస్తున్నాయి.. అందులో వైసీపీ పార్టీ ఓడిపోయి టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం అని టీడీపీ శ్రేణుల్లో నూరిపోస్తున్నారట.. వాస్తవానికి చంద్రబాబుకు జమిలీ ఎన్నికల మీద పెద్ద ఆశ పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా త్వరలోనే ఎన్నికలంటూ తన పార్టీ శ్రేణులను నమ్మించే యత్నంలో ఉన్నారు.