దేశంలో హత్రాస్ సంఘటన రాజకీయ ప్రకంపనలకు వేదిక గా మారుతుంది.. గతంలో జరిగిన నిర్భయ ఘటన కంటే ఈ హత్రాస్ సంఘటన సంచలనంగా మారుతోంది. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని రాజకీయంగా మార్చుకొని బలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తూనే బాధితురాలికి న్యాయం చేయాలనీ పోరాటం చేస్తున్నారు.. గతంలో ఢిల్లీ లో జరిగిన నిర్భయ ఘటన పై ప్రతిపక్షాలు ఇదే విధంగా నిరసనలు చేపట్టాయి.. అయితే అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అందరి తో పాటు అధికార పార్టీ ఈ ఘటన పై చాలా ఆగ్రహంగా వ్యవహరించింది..