దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అన్ని రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి తీవ్రంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే.. నార్త్ లో చాలా వరకు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది.. అంతేకాదు ఎంతో బలంగా కూడా ఉంది.. పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీ అక్కడ అధికారంలోకి రావడం ఖాయమనిపిస్తుంది..దక్షిణాది లో మాత్రం అధికారంలోకి రావడం అంత వీజీ కాదు.. కొన్ని చోట్ల బీజేపీ పార్టీ అంటే ఏంటో అన్నట్లు ప్రజలు ఆలోచిస్తున్నారు.. ఎటొచ్చి ప్రాంతీయ పార్టీ ల తోనే బీజేపీ కి కొంత తలనొప్పి వ్యవహారం నెలకొంది.. ప్రాంతీయ పార్టీ ల హవా తో బీజేపీ లాంటి నేషనల్ పార్టీ లు కనుమరుగైపోయాయని చెప్పొచ్చు..