సీఎం జగన్ రాష్ట్రంలో సమస్యల సంగతి ఎలా ఉన్నా నేడు జరగబోయే మోడీ తో భేటీ పై చాలా రోజులనుంచి ప్రిపేర్ అవుతున్నాడు.. మోడీ పిలుపుకోసమే అన్నట్లు గా అయన ఇన్నాళ్ళు వేచి ఉన్నారు.. చాలా రోజుల తర్వాత మోడీ టైం ఇవ్వడంతో ఈ టైం ని పూర్తి గా సద్వినియోగం చేసుకుని రాష్ట్రానికి పలు ప్రయోజనకరమైన ఫలితాలను తేవాలని జగన్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాడు.. ఈ నేపథ్యంలో నిన్న గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరిన జగన్ తన బృందంతో కలసి ఢిల్లీ కి రాగ ఇటీవలే ఢిల్లీ కి వచ్చిన జగన్ మళ్ళీ కొద్దీ రోజుల్లోనే ఢిల్లీ కి పయనమవడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది..