నేర చరితుల్ని రాజకీయాలనుంచి తుడిచేస్తేనే రాజకీయ వ్యవస్థ మెరుగుపడే అవకాశం ఉందని చాలాకాలంగా మేధావులు వాదిస్తూ వస్తున్నారు.. క్రిమినల్ మైండ్‌తో ఉండే నేతలు రాజకీయ అధికారం పొందడం వల్ల రాజ్యాంగ ఉల్లంఘనలు జరగడమే కాకుండా.. చట్టాలు, రాజ్యాంగాలను సైతం ధిక్కరించేందుకు వెనుకాడటం లేదు. ఈ పరిస్థితి ప్రజాస్వామ్యాన్ని మరింతగా బలహీనం చేస్తోంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు చొరవతో.. రాజకీయలు.. తొమ్మిది నెలల్లో క్లీన్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న ఆశాభావం ప్రజల్లో కనిపిస్తోంది.