రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. అధికార పార్టీ హవా లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడికో కొట్టుకుపోయిందని చెప్పొచ్చు.. అసెంబ్లీ ఎన్నికల ఫలితంలో ఈ విషయం స్పష్టంగా తెలియగా ఇకపై కాంగ్రెస్ పార్టీ ఎలా కొనసాగుతుందో అని అందరు చూస్తున్నారు.. మంచి బలం , బలగం ఉన్న చోట కూడా కాంగ్రెస్ టీ.ఆర్.ఎస్ దెబ్బకు కుదేలైపోయింది.. అప్పటినుంచి కాంగ్రెస్ మరింత ఢీలా పడిపోయిందని చెప్పొచ్చు.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అస్సలు కోలుకోలేదు కాంగ్రెస్.. దీనికి తోడు తెలంగాణ లో బీజేపీ కూడా పుంజుకోవడంతో కాంగ్రెస్ కి వచ్చే ఆ తక్కువ సీట్లు కూడా రాకుండా పోయాయి.. ప్రజల్లో సైతం కాంగ్రెస్ పట్ల నమ్మకం సడలిపోతుంది..