ఒక్కొక్క గ్రామానికి ఇన్ ఛార్జిని నియమించి వారికే పూర్తి బాధ్యతలను అప్పగించింది. ఓటర్లను ఆకట్టుకోవడం దగ్గర నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకువచ్చేంత వరకూ వారిదే బాధ్యత. హరీష్ రావు కూడా తన నియోజకవర్గంలో కూడా చేయనంత పోరాటం ఇప్పుడు చేస్తున్నారు.. వాస్తవానికి హరీష్ ఇంత చేయడానికి లేదు. ఎందుకంటే దుబ్బాక లో ఇంకా అధికార పార్టీ వైపే గాలి వీస్తుంది.. పైగా చనిపోయింది అధికార పార్టీ ఎమ్మెల్యే ఎలాగ సింపతీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎనభై శాతం గులాబీ పార్టీ కే గెలిచే సూచనలు ఉన్నాయి..