రాజకీయాల్లో నాయకులు అలకపాన్పులు ఎక్కడం సహజమే.. తాము అనుకున్నది జరగకపోయినా, దానికి సపోర్ట్ చేయకపోయినా తాము తలచింది అధిష్టానం వినకపోయినా నాయకులు ఆలపాన్పు ఎక్కుతూ ఉంటారు.. అయితే ఇటీవలే ఈ అలకపాన్పు ఎక్కడం వైసీపీ లో ఎక్కువవుతుందని చెప్పాలి. ఇప్పటికే కొంతమంది వైసీపీ నాయకులు అలకపాన్పులు ఎక్కుతూ అధిష్టానాన్ని కొంత ఇబ్బంది పెడుతున్నారు తాజాగా హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించిన వైసీపీ నాయకుడు, మాజీ పోలీస్ గోరంట్ల మాధవ్ అలక పాన్పు ఎక్కారని వార్తలు వినిపిస్తున్నాయి..