ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ ప్రజలపై వేసిన ముద్ర అంతా ఇంతా కాదు..ఇప్పటికి అయన ను ప్రజలు మర్చిపోలేదంటే అది అయన ప్రజలకోసం చేసిన సేవ అలాంటిది.. విద్య వైద్య రంగాల్లో అయన చేసిన సేవకి , ప్రజలకోసం చేసిన మేలు కి ఆయనకు ప్రజలు తమ గుండెల్లో గుడి కట్టారని చెప్పొచ్చు.. తిరుగులేని పథకాలతో ప్రజల్లో నిలిచిపోయిన వైఎస్సార్ ఆరోగ్య శ్రీ, యువతరానికి ఫీజు రీయంబెర్స్ మెంట్ వంటి పథకాల విషయంలో ఎంతో పారదర్శకత చూపించారు. తాజాగా జగన్ తన తండ్రి ఒక అడుగు వేస్తే, తాను రెండడుగులు వేస్తాననే మాట నిలబెట్టుకునేలా సాగుతున్నారు.