మోడీ భజన చేస్తున్న చంద్రబాబు గతంలో మోడీపై చేసిన చాలా విమర్శలను వెనక్కి తీసుకుని వాటిని పొగడ్తగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.. రాఫెల్ విదేశీ యుద్ధ విమానాలను చేర్చుకోవడం భారతదేశానికి గర్వకారణమని, భారత దేశాన్ని ఇది శక్తివంతమైన దేశంగా మార్చిందని చంద్రబాబు కొద్ది గంటల క్రితం చేసిన ట్వీట్ పై నెటిజన్ల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో ఇదే అంశంపై ట్వీట్ చేస్తూ దేశంలోనే ఇది అతిపెద్ద స్కాం అంటూ చంద్రబాబు చేసిన ట్వీట్ ను ఆయనకు గుర్తు చేస్తూ నెటిజన్లు బాబు మాట మార్చారు అంటూ విమర్శిస్తున్నారు.