తాజాగా టీడీపీ పార్లమెంట్ నియోజక వర్గ ఇన్ ఛార్జ్ లను నియమించిన సంగతి తెలిసిందే.. అయితే ఆ నియామకంలో చాలామంది టీడీపీ నేతల నమ్మకాన్ని చంద్రబాబు వమ్ము చేశాడని విమర్శలు వస్తున్నాయి.. ఉదాహరణకి ప్రకాశం జిల్లాను తీసుకుంటే ఇక్కడ నూకసాని బాలజీని నియమించారు. మొన్నటి వరకూ దామచర్ల జనార్థన్ ఉండేవారు. ఆయన్ని కాదని వేరే వారికి ఇవ్వడం ఎవరికీ నచ్చడం లేదు.. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గాన్ని తీసుకుంటే అక్కడ సోమిశెట్టి వెంకటేశ్వర్లును నియమించారు. కర్నూలు సిటీ ఇన్ ఛార్జి టీజీ భరత్ తప్పించి ఈయన నియామకాన్ని ఎవరూ స్వాగతించడం లేదు.