జగన్ కండిషన్ కి నచ్చని కొందరు బీజేపీ లోకి వెళ్తున్నారట.. ఆలా రానున్న రోజుల్లో ఆరుగురు టిడిపి మాజీ కార్పొరేటర్లు బిజెపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. బిజెపిలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్న వారిలో గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ నివాసం ఉన్న ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన, ఆయనకు అత్యంత సన్నిహిత మాజీ కార్పొరేటర్ కూడా ఉన్నట్లు బిజెపి వర్గాలు తెలిపాయి. త్వరలోనే వారంతా అధికారికంగా బిజెపిలో చేరనున్నట్లు సమాచారం. 3 సార్లు కార్పొరేషన్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మాజీ కార్పొరేటర్లు వలసల బాట పట్టడం టిడిపికి మింగుపడని అంశమే..