జరిగిన ప్రతిఘటనను తమకు మైలేజీగా వాడుకోవాలన్న ఏకైక లక్ష్యంతోనే చంద్రబాబు జాతీయ స్థాయి నాయకుడిగా అనుంగు మీడియా ఇచ్చిన కలరింగ్ ఇప్పుడు లేదు. అక్కడెక్కడో చక్రం తిప్పడం మాట అటుంచితే ఉభయ తెలుగురాష్ట్రాల్లోనూ, ఆ మాటకొస్తే ఏపీ ఒక్కచోటా కూడా అంతంత మాత్రంగానే చక్రం తిరుగుతోంది. ఉదయం కాగానే రాష్ట్రంలో ఏ పక్క నుంచి నాయకుడు పక్కపార్టీకి జారిపోతాడో అనే శంకతోనే నిద్ర లేవాల్సిన పరిస్థితులు ఉన్నాయి.