వచ్చే ఏడాది జనవరి వరకూ ఏపీలోని పంచాయతీ, పట్టణ సంస్థలు ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల పూర్వ పరిణామాలు ఇలా ఉండగా.. ఇప్పుడు ఈ అంశంపై జరుగుతున్న పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషనర్‌కు మధ్య మళ్లీ బేదాభిప్రాయాలు నెలకొనే అవకాశం కనిపిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదనగా.. హైకోర్టు నోటీసులకు ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఏమని సమాధానం ఇస్తుందన్నది సర్వత్రా ఆసక్తిని రేకిస్తోంది.