మొత్తానికి గంటా శ్రీనివాస్ రావు వైసీపీ లోకి రావడానికి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తుంది.. గత కొన్ని రోజులుగా ఏ పార్టీ కి వెళతాడు అని తెగ గుసగుసలు నడిచాయి.. కొన్ని రోజులు వైసీపీ లోకి గంటా వస్తాడని, లేదు బీజేపీ లోకి గంటా ఎంట్రీ అని చాలామంది చాలా ప్రచారాలు చేశారు.. కానీ గంటా చివరికి వైసీపీ లోకి రావడానికే మొగ్గు చూపారని అంటున్నారు.. నిజానికి మొదట గంటా వైసీపీ లోకి రావడానికి చూశారు కానీ విశాఖ లోని వైసీపీ నేతలు అయన రాకని చాలా వరకు ఆపే ప్రయత్నం చేశారు. ఎక్కడ తమ అస్తిత్వం కోల్పోతుందేమోనని గంటా రాకను విజయ్ సాయి రెడ్డి, అవంతి శ్రీనివాస్ లాంటి నేతలు ఆయనను వ్యతిరేకించారు..