నూతన్ నాయుడు భార్య మధుప్రియ కూడా ఉద్యోగాల పేరుతో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి నుండి 25లక్షలు వసూలు చేశారని పోలీసులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దళిత యువకుడి శిరోముండనం కేసులో బెయిల్ పొందిన ఆమె కొద్ది గంటల్లోనే మళ్ళీ అరెస్ట్ కావడం గమనార్హం. ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసి డబ్బులు వసూలు చేసారని మోసపోయిన వ్యక్తి పిర్యాదు చేయడంతో పోలీసులు మధుప్రియపై చీటింగ్ కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.. ఈ నేపథ్యంలో నూతన్ నాయుడు ఇంకెన్ని చట్ట వ్యతిరేఖ పనులు చేశారో అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు..