చెరుకు శ్రీనివాస్ రెడ్డి.. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు. ఆయనకు నియోజకవర్గ వ్యాప్తంగా అనుచరగణం ఉంది. సోలిపేట రామలింగారెడ్డి మరణం కారణంగా టిక్కెట్ తనకే ఇస్తారని ఆయన ఆశలు పెట్టుకున్నారు. కానీ కేసీఆర్ రామలింగారెడ్డి భార్యకు టిక్కెట్ ఖరారు చేశారు. దాంతో అయన కాంగ్రెస్ లోకి వెళ్లి అక్కడినుంచి పోటీ చేస్తున్నారు.. ఈ క్రమంలో దుబ్బాక కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరిపోయారు. దుబ్బాక కాంగ్రెస్ టిక్కెట్ ను ఆశించిన నరసింహారెడ్డి, మనోహర్ రావులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కొత్తగా చేరిన చెరకు శ్రీనివాసులురెడ్డికి టిక్కెట్ ఇవ్వడంతో వీరిద్దరూ టీఆర్ఎస్ లో చేరిపోయారు.