చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు కూడా ఇప్పుడు ఆ పార్టీ కి తలనొప్పులుగా మారుతున్నాయి.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం.. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పాలనా అనుభవం ఉన్న నేత ఆధ్వర్యంలో నడుస్తున్న పార్టీ ఇప్పుడు కేవలం ఉనికి కోసమే కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా కనిపిస్తోంది. కాషాయిరంగు పులుముకున్న పసుపు దళం ప్రయత్నాలు ఫలించకపోవడం.. ఒక్కో నేత పార్టీ నుంచి జారుకుంటుండడంతో ఎలాగైనా టీడీపీని నిలబెట్టుకోవాలనే తపన ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది.