అమరావతి ఉద్యమం విషయంలో చంద్రబాబు ఇంకా గట్టి పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా అమరావతే రాజధానిగా ఉండాలని తెలుగుదేశం పార్టీ తీర్మానం చేసేసింది. అదే తీర్మానానికి కట్టుబడి ఉండాలని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని టీడీపీ నాయకులపై కూడా ఒత్తిడి తెస్తోంది. అయితే ఈ ధోరణి నచ్చక కొంతమంది వైసీపీ లోకి వెళ్లగా చంద్రబాబు కు అక్కడ ఎవరు పోరాటం చేసేది అని అంటున్నారు. అయినప్పటికీ పరిస్థితిని అర్ధం చేసుకోకుండా ఇంకా అమరావతి పోరాటం అంటూ చంద్రబాబు మరోసారి పిలుపునివ్వడం, అన్ని ప్రాంతాల వారిని అందులో భాగస్వాములు కావాలని ఆదేశాలివ్వడమే సొంత పార్టీ నాయకుల నుంచి కూడా ఆక్షేపణలు కారణమవుతోంది.