74 ఏళ్ల వయసులో ఆయన ఎంత కాలం రాజకీయం చేస్తాడో తెలియని పరిస్థితుల్లో ఉన్న చంద్రబాబు మాత్రమే ఏపీ ప్రభుత్వ పెద్దలకు కనిపిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా ఏం జరిగినా.. తాము స్వయంగా తెచ్చి పెట్టుకున్నదే అయినా.. చంద్రబాబే చేయిస్తున్నారని కలవరపడుతున్నారు. నిజంగానే కలవరపడుతున్నారో లేక… అలా ప్రజలను నమ్మించి… చంద్రబాబును బూచిగా చూపి.. తాము గండం గట్టెక్కాలనుకుంటున్నారో కానీ… అన్నింటికీ చంద్రబాబునే బూచిగా చూపించడం ప్రారంభించారు. దాంతో చంద్రబాబు పూర్తి విలన్ గా మారిపోతున్నారు.