జంప్ జిలాని క్యాండెట్ లను చంద్రబాబు పూర్తి గా పక్కకు పెట్టినట్లు తెలుస్తుంది. అంతేకాదు లేడీ నేతలను కూడా చంద్రబాబు తనదైన స్టైల్ లో దూరం పెడుతున్నారు.. తెలుగు మహిళా విభాగంలో పార్లమెంటు వారీగా మహిళలకు పదవులు చంద్రబాబు కట్టబెట్టారు. వారిలోనూ వైసీపీ నుంచి వచ్చిన మహిళలకు కూడా ప్రాధాన్యత లేదు. రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరికి అరకు పార్లమెంటరీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చినా అక్కడ ఆమె ఎంత డమ్మీ నేతో అందరికి తెలిసిందే. మహిళా నేతలకు పదవులు ఇవ్వాలంటే చాలా మంది ఫైర్బ్రాండ్లే ఉన్నారు.