దుబ్బాక లో ఎన్నికలకు అంతా సిద్ధమయ్యింది.. అన్ని పార్టీ ల అభ్యర్థులు ఖరారు కాగా ఇక్కడ టీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్లు చెప్తున్నారు.. అక్కడి అభ్యర్థులు కూడా ప్రచార పర్వంలో ఒకరి పై ఒకరు విమర్శించుకుంటూ ప్రజల్లో కి దూసుకుపోతున్నారు.. ఇక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి కి టికెట్ ఇవ్వగా, బీజేపీ పార్టీ రఘునందన్ రావు సీటు ను కేటాయించింది.. అధికార పార్టీ సోలిపేట సుజాతకు సీటు ఇవ్వగా గెలుపుపై ధీమాగా ఉంది..