తెలంగాణాలో ఎన్నికల జోరు ఊపందుకుంది.. ఇప్పటికే దుబ్బాక ఎన్నికల నోటిఫికేషన్ రాగ నవంబర్ 3 న ఈ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అయితే ఇన్నాళ్లు తెలంగాణాలో టిఆర్ఎస్ పార్టీ కి ఎదురు లేదన్నది వాస్తవం.. ఇప్పుడు కూడా లేదు కానీ ప్రతిపక్షాలు తామంటే తాము టిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం అని చెప్తూ గులాబీ నేతలను నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది.. ఎవరు తెలంగాణ లో ప్రతామ్నాయ పార్టీ అనేది ప్రజలు చూసుకుంటారు చేయాల్సిన పని చేయమని గులాబీ నేతలు అంటుంటే కాంగ్రెస్, బీజేపీ పార్టీ అధికారమే లక్ష్యం గా సాగిపోతూ ప్రజలను చిరాకు పెట్టిస్తున్నారు..