వైసీపీ పార్టీ లో కీలక నేత, జగన్ తర్వాత అంతటి నాయకుడు ఎవరు అంటే విజయ్ సాయి రెడ్డి అనే చెప్పాలి.. జగన్ కి ఆప్తుడు అయిన విజయ సాయి రెడ్డి ఉత్తరాంధ్ర లో పార్టీ బలోపేతానికి కీలకంగా వ్యవహరిస్తున్నాడు.. ఆయన పార్లమెంట్ లో అడిగే ప్రశ్నలన్నీ విశాఖ సమస్యలు, అభివృధ్ధి గురించే. ఆయన విశాఖలో ఫ్లైట్ ఎక్కితే ఢిల్లీలో దిగుతారు. ఢిల్లీ నుంచి మళ్ళీ విశాఖకే వస్తారు. నెల్లూరు పెద్దాయన గా పేరున్న విజయ సాయి రెడ్డి కి విశాఖ లోకల్ అయిందని చెప్పాలి.. అయితే అక్కడి లోకల్ లీడర్స్ విజయ సాయి మీద ఇదే అంశం మీద గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది.. ఒక నాన్ లోకల్ వచ్చి తమపై పెత్తనం చెలాయించేది ఏంటి అనేది వారి వాదన..