ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ ప్రజలపై వేసిన ముద్ర అంతా ఇంతా కాదు..ఇప్పటికి అయన ను ప్రజలు మర్చిపోలేదంటే అది అయన ప్రజలకోసం చేసిన సేవ అలాంటిది.. విద్య వైద్య రంగాల్లో అయన చేసిన సేవకి , ప్రజలకోసం చేసిన మేలు కి ఆయనకు ప్రజలు తమ గుండెల్లో గుడి కట్టారని చెప్పొచ్చు.. ఎంత వత్తిడి లో ఉన్నా ఎలా నెగ్గాలో జగన్ నుంచి అందరు నేర్చుకోవాల్సిన విషయం. ఓ ఎనిమిది సంవత్సరాల ముందు జగన్ పరిస్థితి ఎలా ఉన్నది అనేది అందరికి తెలిసిందే.. ఓ వైపు తండ్రి మరణం, మరి వైపు కేసులు, ఇంకో వైపు అప్పుడే పుట్టిన పార్టీ భాధ్యతలు ఇవన్ని జగన్ కి ఒకేసారి ముంచుకు రావడంతో అయన ఎలా తట్టుకుని నిలబడతారో అని అందరు అనుకున్నారు..