ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయినా జేసీ కుటుంబానికి కష్టాలు తప్పట్లేదు.. ఓ వైపు జగన్ ని పొగుడుతూనే మరోవైపు ఆయనపై చేయాల్సిన కుట్రలు అన్ని చేస్తున్నాడు..దాంతో జగన్ దీన్ని పసిగట్టి వారి పనిపాట పనిలో నిమగ్నమైపోయాడు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగారు. అయితే ఆయనతోనూ వారికి సన్నిహిత సంబంధాలు లేవు. మొదటి సారి కాంగ్రెస్ గెలిచినప్పుడు మంత్రి పదవి తెచ్చుకున్నా.. రెండో సారి ఆ అవకాశం దక్కలేదు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకపోవడంతో … చిరకాల ప్రత్యర్థి పరిటాల కుటుంబం టీడీపీలో ఉన్నప్పటికీ..వైసీపీ నుంచి ఆఫర్ ఉన్నప్పటికీ..వారు జగన్ వెంట నడవకుండా… టీడీపీలో చేరారు.