తెలంగాణాలో ఇటీవలే జరిగిన నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కేసీఆర్ గారాల పట్టి కవిత కల్వకుంట్ల గెలిచినా సంగతి అందరికి తెలిసిందే. గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆమె కోల్పోయిన దగ్గరే గెలిచి తన పంతం నెగ్గించుకుంది. పోలైన మొత్తం 823 ఓట్లలో 728 ఓట్లు కవితే దక్కాయి. కాంగ్రెస్, బీజేపీలకు కలిపి వంద ఓట్లు కూడా రాలేదు. టీఆర్ఎస్ అసలు బలం 505 మంది మాత్రమే. కానీ ఓట్లు మాత్రం 123 ఎక్కువ వచ్చాయి. దాంతో కవిత అక్కడ చేసిన పనితనం కనిపిస్తుంది.. ఓడిపోయినా కోపం ప్రదర్శించకుండా అక్కడి వారి తో ఆమె మంచి గా మెలిగి మళ్ళీ గెలుపు సాధించింది..