మొదటినుంచి పథకం ప్రకారమే గంటా ప్రవర్తిస్తూ ఉన్నారు.. తనకు తానుగా వైసీపీ లోకి వెళ్లాలని చెప్పకుండా వైసీపీ నేతల నోటివెంట అయన రావద్దు అని చెప్పొస్తూ తనపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా చేశారు.. ముందుగా తన కొడుకుని చేర్చి తాను అనుబంధ సభ్యుడిగా ఉంటే మజా ఏముంటుందని ఆలోచిస్తున్నారు. తాను మళ్లీ గెలిచి వైసీపీ ఎమ్మెల్యే కావాలని ఆయన బలంగా కోరుకుంటున్నారు. జగన్ వేవ్ లోనే గెలిచిన తనకు అధికార పార్టీ తరఫున గెలవడం ఏమంత కష్టం కాదని ఆయన నమ్ముతున్నారు. ఇలా గెలిచి వచ్చిన తరువాత మంత్రి పదవికే ఆయన గురి పెడతారు అని కూడా అంటున్నారు.