రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అయన తీసుకున్న ఓ సంచలనాత్మక నిర్ణయం రాజధాని మార్పు.. అమరావతి నుంచి అయన విశాఖ కి రాజధానిని తరలించడం పెద్ద సంచలనమే అని చెప్పాలి. కేంద్రంలోని పెద్దలను రాష్ట్రంలోని ప్రజలను ఒప్పించి జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు ఫలిస్తుందో తెలీదు కానీ జగన్ అయితే పెద్ద సాహసమే చేశారని చెప్పాలి.. అయితే ఇప్పటికి అయితే ఈ రాజధాని మార్పు పెండింగ్ లో ఉందని చెప్పాలి.. అప్పట్లో రేపో మాపో షిఫ్టింగ్ మొదలవుతుందని చెప్పినా ఎందుకు అది ఆగిపోయింది.. తాజాగా జగన్ మళ్ళీ రాజధానికి అంతా షిఫ్ట్ చేయడానికి ముహూర్తం ఖరారు చేశారని చెప్పొచ్చు..