వర్షం వల్ల నగరంలో పలు చోట్ల తొమ్మిది మంది చనిపోగా మంత్రి తలసాని శ్రీనివాస్ దీనిపై ఎమర్జెన్సీ ని ప్రకటించి టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రవేశ పెట్టారు.. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయాలనీ వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై సహాయక చర్యలు తీసుకుంటుందని చెప్పారు.. ఇక భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు ఏవిధంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేలా చర్యలు సైతం చేపట్టింది..