వర్షాల ధాటికి వివిధ ప్రాంతాల్లో ఏడుగురు మృతి చెందగా, నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లు తున్నాయి.. పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి.. కాకినాడ, విజయవాడ, రాజమహేంద్రవరం నగరాల్లో లోతట్టు కాలనీల్లోని ఇళ్లలోకి భారీగా నీరు చేరింది. దీంతో రాత్రంతా వారు నీటిలోనే గడపాల్సి వచ్చింది. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణమ్మా ఉధృత రూపం దాల్చడంతో కృష్ణా కరకట్టపై ఉన్న దాదాపు 30 ఇళ్లల్లోకి నీరు వచ్చే ప్రమాదం ఉందని ముందుగానే అధికారులు నోటీసులు ఇచ్చారు.. ఇక అక్కడి వారిని కాపాడేందుకు చర్యలు చేపట్టగా వారిని కాపాడేందుకు సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలుస్తుది..