నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత భారీ మెజర్టీ తో గెలిచిన సంగతి తెలిసిందే.. తెలంగాణ గులాబీ పార్టీ పని అయిపోయిందన్న వారికి ఇదో పెద్ద దెబ్బ అని చెప్పాలి.. రానున్న దుబ్బాక, గ్రేటర్ , ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ ఎన్నిక మంచి బలం అవుతుందని చెప్పనవసరం లేదు.. అయితే తెరాస పార్టీ కి ఇక్కడ గెలుపు పై ధీమా మొదటినుంచి ఉండగా ఇక్కడ కేవలం గెలుపుకోసమే పార్టీ బరిలోకి దిగలేదు అని తెలుస్తుంది.. పోలైన మొత్తం 823 ఓట్లలో 728 ఓట్లు కవితే దక్కాయి. కాంగ్రెస్, బీజేపీలకు కలిపి వంద ఓట్లు కూడా రాలేదు.